Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 24863
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 24, 2009 @5:29:09 AM EST  

భజరే రగువీరం
రాగం: కల్యాణి
తాళం: ఆది



పల్లవి

భజ రే రఘువీరం శర భరిత దశరథ కుమారం
(భజ రే)


చరణాలు:
1

నీవు దురాశల రోసి పరనిందల నెల్లను బాసి
(భజ రే)

2

పంచేంద్రియముల నణచు ప్రపంచ సుఖము విషమనుచు
(భజ రే)

3

అన్నియు పనికొదిగేనా ఇటు అటు తిరిగిన తెలిసేనా
(భజ రే)

4

వేరుపనులకు బోక గోముఖ వ్యాఘ్రము చందము గాక
(భజ రే)

5

తప్పు తంటలను మాని భవ తరామునను మతిపూని
(భజ రే)
6

కర్మము హరికి నొసంగి సత్కార్యములందుప్పొంగి
(భజ రే)

7

భక్తి మార్గమును తెలిసి నిజ-భాగవతుల జత గలసి
(భజ రే)

8

మాయారహితుని గొలిచి నీ-మనసున రాముని దలచి
(భజ రే)

9

కామాదుల నేగించి నీ కార్యములను సాధించి
(భజ రే)
10

రాజాధిపుగా వెలసి త్యాగరాజ వరదుడని తెలిసి
(భజ రే)



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.