Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 2557
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, January 24, 2008 @8:05:36 AM EST  


ఖరహరప్రియ
ప|| ఒకపరి కొకపరి కొయ్యారమై |
మొకమున కళలెల్ల మొలసినట్లుండె ||

చ|| జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి |
జిగిగొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాను |
పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె ||

చ|| పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు |
కరిగి యిరుదెసల కారగాను |
కరిగమన విభుడు గనుక మోహ మదముల |
తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె ||

చ|| నెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను |
తరచైన సొమ్ములు ధరియించగా |
మెరుగుబోడీ అలమేలు మంగయు తాను |
మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.