Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 2674
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 3  (Vote)

Posted On Friday, January 25, 2008 @7:17:17 AM EST  


ప|| ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు |
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ||


చ|| అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము |
పంతమాడే కంసునిపాలి వజ్రము |
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస |
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ||

చ|| రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము |
మితి గోవర్ధనపు గోమేధికము |
సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము |
గతియై మమ్ముగాచే(టి) కమలాక్షుడు ||


చ|| కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము |
ఏలేటి శ్రీ వేంకటాద్రి యింద్ర నీలము |
పాలజల నిధిలోని పాయని దివ్యరత్నము |
బాలుని వలె తిరిగీ పద్మనాభుడు ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.