Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 2943
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 3  (Vote)

Posted On Wednesday, January 30, 2008 @7:46:03 AM EST  


ముఖారి

ప|| బ్రహ్మకడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||

చ|| చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

చ|| కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

చ|| పరమ యోగులకు పరి పరి విధముల
వర మొసగెడి నీ పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.