Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3082
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, February 01, 2008 @7:18:06 AM EST  


ప|| కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||


చ|| సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు కన్నీరు
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ||

చ|| పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడనందరి కనులకింపై
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ||

చ|| తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.