Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3357
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, February 07, 2008 @5:03:32 AM EST  


కాకరకాయ పకోడి కూర .

కాకరకాయలు ( మీడియం వి అయితే 4 , వాటిని మూడు సమాన ముక్కలు చేసుకోవాలి , పైనుండి నిలువుగా , క్రిందినుండి అడ్డంగా మరీ చివరివరకు కాకుండా కోసుకోవాలి అలా అయితే మసాల నిలుస్తుంది , మరీ చిన్నవి అయితే కాయపలముగా కట్ చేసుకోవాలి ) .

ఉల్లిపాయలు ( పెద్దవి ) - రెండు .
నూనె - 1 కప్పు
అల్లం ముక్కలు - 1 టెబల్ స్పూన్
సెనగపిండి - 4 టేబల్ స్పూన్లు
ఉప్పు , కారము - తగినంత
జీరకర్ర పొడి - 1 టేబల్ స్పూన్.

తయ్యారీ విధానము :
ముందుగా మూకుడిలో నూనె వేసుకొని అందులో ఈ కాకరకాయముక్కలు ( పూర్తిగా కాకుండా) వేయించుకోవాలి . వేయించిన ముక్కలు పక్కన పెట్టుకోవాలి.
ఆ గిన్నెలోని నూనె వేరే కప్పులో తీసేసి ఆ మూకుడులొ 2 స్పూన్లు నూనె వుంచి అందులో ఉల్లిచెక్కు ( సన్నగా తరిగిన ఉల్లిపాయలు ) అల్లము ముక్కలు వేయించుకోవాలి , పూర్తిగా వేగాక ( ఎర్రగా వేయించవద్దు ) అందులో ఉప్పు , కారము , జీరా పొడి , చివరిలో సెనగపిండి వేసి చల్లారాక ఆ ముద్ద ఈ కాకర కాయల్లో పెట్టి , మళ్ళి కొంచము నూనె వేసుకొని వేయించు కోవాలి ఇప్పుడు కొంచం ఎర్రగా వేయించవచ్చు . కాకరకాయలకి కూడా ఉప్పు కారము అంటాలి కాబట్టి ఉల్లిముద్దలోనే కొద్దిగా ఉప్పుకారము ఎక్కువవేసుకోవాలి.

మజ్జిగపులుసుతో బాటు ఇవి మంచి కాంబినేషన్.



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.