Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3473
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, February 08, 2008 @8:46:20 AM EST  


ప|| పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు
ధరమము విచారించ తగునీకు అమ్మ ||

చ|| కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి
అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి
విమలపు నీపతికి విన్నపము జేసి మమ్ము
నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ ||

చ|| కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ
దోమటి చల్లిన చంద్రు తోబుట్టుగ
నీమగని పంపునను నిజసిరులిచ్చితివి
నేమపు వితరణము నీకే తగునమ్మ ||

చ|| పాలజలధి కన్యవు పద్మాసినివి నీవు |
పాలపండే శ్రీవేంకటపతి దేవివి
ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా |
పాల గలిగితివి సంబంధము మేలమ్మ ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.