Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3639
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, February 13, 2008 @9:22:07 AM EST  


ప|| ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రికకాదుకదా ||

చ|| కలికి చకోరాక్షికి కడకన్నుల కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
సలుపునప్రాణేశ్వరుపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ||

చ|| పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెదవెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగనివేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడాలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ||

చ|| ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కౌగిటయధరామౄతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదుకదా ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.