Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3694
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, February 14, 2008 @8:39:55 AM EST  


ప|| నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప-
నగరాజధరుడ శ్రీనారయణా ||

చ|| దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య-
నోపకరా నన్ను నొడబరపుచు
పైపైనె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా ||

చ|| చికాకుపడిన నా చిత్తశాంతము సేయ-
లేకకా నీవు బహులీల నన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా ||

చ|| వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీనారాయణా ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.