Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3760
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, February 15, 2008 @9:32:21 AM EST  


ప|| క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ||

చ|| జలజాక్షి మోమునకు జక్కవకుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం ||

చ|| చరణ కిసలయములకు సకియలంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||

చ|| పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ జక్క దనముల కెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.