Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3834
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, February 17, 2008 @10:40:13 AM EST  


సాళంగనాట

ప|| అన్నిట నేరుపరిగా అలమేలు మంగ నీకు
చిన్నచిన్న ముద్దులనే విడిపించెను ||

చ|| చనవు మెరసి నిన్ను సారెసారె చేరుకుని
మనసు దనియ నాపె మాటలాడెను
కనుసన్న చూపులనె కప్పుర విడెములిచ్చె
దనువు దనియ నీపై తలబాలు వోసెను ||

చ|| పన్నుగడ తొడనే పానుపు చేరువనే
కన్నులు దనియగ దగ్గర నిలచెను
మన్ననలు దైవార మచ్చికలు పెడరేచి
విన్నవీనుల దనియ విన్నపాలు సేసెను ||

చ|| మాగిన మోవి యిచ్చి మనసు గరచి యిట్టే
కౌగిలి దనియ నీకు కప్పె పయ్యెద
వీగక శ్రీ వేంకటేశు వెలది గూడితివిట్టె
రాగి వయసి దనియ రతి కేళి సేసెను ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.