Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3841
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Monday, February 18, 2008 @6:27:23 AM EST  


అంతా రామమయం
రాగం: ఆనంద భైరవి


OR

కామవర్ధని



తాళం: ఆది



పల్లవి :

అంతా రామమయం ఈ జగమంతా రామమయం

చరణం : 1

అంతరంగమున- నాత్మారాముఁడ
నంత రూపమున -వింతలు సలుపఁగ

సోమ సూర్యులు -సురలు తారలను
ఆ మహాంబుధులు అవనీతలంబులు !!

చరణం : 2

అండాండంబులు- పిండాండంబులు
బ్రహ్మాండంబులు -బ్రహ్మలు మొదలుగ

నదులు వనంబులు -నానా మృగములు
విదిత కర్మములు -వేద శాస్త్రములు !!

చరణం : 3

అష్ట దిక్పతులును -ఆది శేషుఁడును
అష్ట వసువులను- నరిషడ్వర్గము

ధీరుఁడు భద్రాచల రామదాసుని
కోరిక లొసఁగిన- తారక నామము !!





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.