Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3859
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 2  (Vote)

Posted On Monday, February 18, 2008 @8:58:30 AM EST  


రాగం: బౌళి

ప|| తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన ||

చ|| బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే
పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||

చ|| కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ ||

చ|| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలు డుండేటి సరిభూమి యొకటే ||

చ|| అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే
ఘనకీట పశువులకు కామ సుఖమొకటే
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే
వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||

చ|| కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే
పరగ దుర్గంధములపై వాయువొకటే
వరుస బరిమళముపై వాయువొకటే ||

చ|| కడగి యేనుగు మీద గాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.