Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3896
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, February 19, 2008 @9:35:34 AM EST  



రాగము : వరాళి
ఆదితాళము .

ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ, |ఇదిగో...|

ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
కలిసి కొలువగా రఘుపతి యుండెడి, |ఇదిగో...|

చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతొ సుందరమై యుండెడి, |ఇదిగో...|

అనుపమానమై అతి సుందరమై దనరు
చక్రము ధగ ధగ మెరసెడి, |ఇదిగో...|

పొన్నల పొగడల పూపొదరిండ్లను
చెన్ను మీరగా శృంగారంబగు, |ఇదిగో...|

శ్రీ కరముగ శ్రీ రామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము, |ఇదిగో...|

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ






Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.