Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4038
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Friday, February 22, 2008 @8:26:40 AM EST  


రాగం: మణిరంగు

ప|| జయజయ రామ సమర విజయరామ
భవహర నిజభక్తి పారీణరామ ||

చ|| జలధి బంధించిన సౌమిత్రిరామ
సెలవిల్లు విరచిన సీతారామ
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ
కలిగి యజ్ణము గాచే కౌసల్య రామ ||

చ|| అరి రావణాంతక ఆదిత్య కులరామ
గురుమౌనులను గాచే కోదణ్డరామ
ధర నహల్యపాలిటి దశరథ రామ
హరురాణి నుతుల లోకాభిరామ ||

చ|| అతి ప్రతాపముల మాయామృగాంతక రామ
నుత కుశలవ ప్రియ సుగుణరామ
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామ
మతిలోన బాయని మనువంశ రామ ||జయ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.