Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4208
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 3  (Vote)

Posted On Tuesday, February 26, 2008 @9:02:59 AM EST  


రాగం: ఆనంద భైరవి

తాళం: ఆది

పలుకే బంగారమాయెనా కోదండపాణి, |పలుకే…|

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలోఁ నీ నామస్మరణ మరవ చక్కనిసామి |పలుకే...|

రవుగనిసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి |పలుకే...|


రాతినాతిక జేసి భూతలమున ప్రఖ్యాతి
జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి |పలుకే...|


ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి |పలుకే...|


శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భద్రాచల వర రామదాస పోష |పలుకే...|






Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.