Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4327
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, February 28, 2008 @10:31:52 AM EST  


రాగం :శ్రీరాగం

ప|| ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా ||

చ|| ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార
లలిత నిశ్వాసడోలా రచనయా
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన-
చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||

చ|| వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత-
లవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ
నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||

చ|| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి-
కార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ-
కారణ ప్రకట వేంకట నారసింహా ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.