Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4382
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, March 03, 2008 @7:05:21 AM EST  


రాగం : లలిత

ప|| నటనల భ్రమయకు నా మనసా
ఘటియించు హరియే కలవాడు ||

చ|| ముంచిన జగమిది మోహినీ గజము
పొంచిన యాస పుట్టించేదిది |
వంచనల నిజమువలెనే వుండును
మంచులు మాయలె మరునాడు ||

చ|| సరి సంసారము సంతలకూటమి
సొరిది బజారము చూపేదిది
గరిమ నెప్పుడు గలకల మనుచుండును
మరులగు విధమే మాపటికి ||

చ|| కందువ దేహముగాని ముదియదిది
అందిన రూప మాడేదిది
యెందును శ్రీ వేంకటేశ్వరుండును
డిందు పడగనిదె తెరమరుగు ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.