Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4501
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, March 06, 2008 @10:38:29 AM EST  

42.
రాగం : ఆహిరి

ప|| మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆసల చిత్తాన కేలే అలవోకలు ||

చ|| కందులేని మోము కేలే కస్తూరి
చిందు నీకొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోత
గందమేలే పైపై కమ్మని నీమేనికి ||

చ|| భారపు గుబ్బల కేలే పయ్యద నీ
బీరపు జూపుల కేలే పెడమోము
జీరల బుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||

చ|| ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరులు
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.