Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4861
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, March 18, 2008 @9:08:09 AM EST  

రాగం: శ్రీరాగం

ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||

చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద
పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు
పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||

చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె బెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి
బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||

చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను
పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.