Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5090
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, March 25, 2008 @12:34:29 PM EST  

రాగం : పాడి
ప|| సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవు ||

చ|| రుకుమిణి దేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమున జెదరిన యలకలు
వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||

చ|| తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై
నడపులమురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలికవాపను పరమంబాయ ||

చ|| అనుదినమునును నీ యలుమేలుమంగ
కనుగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి
చనువుల సొబగుల సంపదలాయ ||






Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.