Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5240
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Saturday, March 29, 2008 @6:06:00 AM EST  

రాగం : హుసేని/శుద్ధరామక్రియ

ప|| అన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||

చ|| కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మినాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి ||

చ|| చిన్నిమకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వౄశ్చికరాశి ||

చ|| ఆముకొని నొరపుల మెరయు నతివకు వౄషభరాశి
గామిడి గుట్టుమూల సతి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కొమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.