Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5317
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, April 01, 2008 @8:30:05 AM EST  

రాగం : రామక్రియ/దేశి

ప|| నారాయణాయ నమో నమో
నానాత్మనే నమో నమో |

అనుపల్లవి : యీరచనలనే యెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి ||

చ|| గోవిందాయ నమో నమో
గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో
ప్రణవాత్మనే నమో నమో
దేవేశాయ నమో నమో
దివ్యగుణాయ నమో యనుచు
యీవరుసలనే యెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి ||

చ|| దామోదరాయ నమో నమో
ధరణీశాయ నమో నమో
శ్రీమహిళాపతయే నమో
శిష్టరక్షిణే నమో నమో
వామనాయ తే నమో నమో
వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి

చ|| పరిపూర్ణాయ నమో నమో
ప్రణవాగ్రాయ నమో నమో
చిరంతన శ్రీ వేంకటనాయక
శేషశాయినే నమో నమో
నరకధ్వంసే నమో నమో
నరసింహాయ నమో నమో
యిరవుగ నీగతి నెవ్వరు
దలచిన యిహపర మంత్రము లిందరికి ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.