Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5357
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, April 02, 2008 @7:13:20 AM EST  

రాగం: పాడి/ఝంఝూటి

ప|| ఏలే యేలే మరదలా
చాలుజాలు చాలును
చాలు నీతోడి సరసంబు బావ ||

చ|| గాటపు గుబ్బలు గదలగ గులికేవు
మాటల దేటల మరదలా |
చీటికి మాటికి జెనకేవే వట్టి
బూటకాలు మానిపోవో బావ ||

చ|| అందిందె నన్ను నదలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో దిరిగేవి నటకారివో బావ
పొందుగాదిక బోవే బావ ||

చ|| చొక్కపు గిలిగింతల చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగులైతి బావ ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.