Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5417
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 03, 2008 @4:02:48 AM EST  

రాగం : ఝంఝూటి
ప|| నవనీతచోర నమోనమో
నవమహిమార్ణవ నమోనమో ||

చ|| హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ
నరసింహ వామన నమోనమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నరనారాయణ నమోనమో ||

చ|| నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమోనమో
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమోనమో ||

చ|| వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర
నాకేశవందిత నమోనమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర
నాకజననుత నమోనమో ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.