Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5464
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Friday, April 04, 2008 @4:29:15 AM EST  

రాగం : ముఖారి

ప|| రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే ||

చ|| వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే ||
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే ||

చ|| ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే |
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే ||

చ|| బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే |
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.