Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5638
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, April 09, 2008 @9:20:17 AM EST  

రాగం : ఆభేరి

ప|| పలుకు తేనియల
తల్లి పవళించెను
కలికి తనముల
విభుని కలిసినది గాన ||

చ: నిగనిగని మోముపై నెరులు
గెలకుల చెదర
పగలైన దాక చెలి పవళించెను
తెగని పరిణతులతో
తెల్లవారిన దాక
జగదేక పతి మనసు జట్టిగొనె గాన ||

చ|| కొంగు జారిన మెరుగు
గుబ్బ లొలయగ తరుణి
బంగారు మేడపై పవళించెను
చెంగలువ కనుగొసల
సింగారములు దొలక
అంగజగురునితోడ అలసినది గాన ||

చ|| మురిపెంపు నటనలతో
ముత్యాల మలగుపై
పరవశంబున తరుణి పవళించెను
తిరువేంకటాచలాధిపుని కౌగిట గలసి
అరవిరైనును చెమట నంటినదిగాన ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.