Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5764
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, April 14, 2008 @3:41:30 AM EST  

సీతా కల్యాణ వైభోగమే

రాగం : శంకరాభరణం

ప:
సీతా కల్యాణ వైభోగమే
రామా కల్యాణ వైభోగమే


చ :
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర

చ:
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల

చ: పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ

చ:
సర్వ లోకాధార సమరైక వీర
గర్వ మానస దూర కనకాంగ ధీర

చ:
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధరాఘ విదార నత లోకాధార

చ:
పరమేశ నుత గీత భవజలధి పోత
తరణి కుల సంజాత త్యాగరాజ నుత



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.