Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5768
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, April 14, 2008 @4:11:27 AM EST  

రాగం : కల్యాణి
ప|| రామ రామ రామ కృష్ణ
రాజీవ లోచన నీకు దీమువంటి బంటననే తేజమే నాది ||

చ|| వారిధి దాటి మెప్పించ వాయుజుడనే గాను
సారె చవుల మెప్పించ శబరి గాను
బిరాన సీతనిచ్చి మెప్పించ జనకుండ గాను
ఏరీతి మెప్పింతు నన్నెట్లు గాచేవో ||

చ|| ఘనమై మోచి మెప్పించ గరుడనేగాను
కొనకామ సుఖమిచ్చు గోపిక గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగిగాను
నిన్నెట్లు మెప్పింతు నన్నుగాచేదెట్లా

చ|| నవ్వుచు పాడి మెప్పించ నారదుడనేగాను
అవ్వల ప్రాణమీయ జటాయువుగాను
ఇవ్వల శ్రీవేంకటేశ యిటునీకు శరణంటి
అవ్వల నాతెరువిదే రక్షించేదెట్లా




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.