Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5774
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, April 14, 2008 @4:51:07 AM EST  

రాగం : కాంభోజి

ఏమయ్య రామ బ్ర-హ్మేంద్రాదులకునైన
నీ మాయ దెలియ వశమా ?
కామారివినుతగుణ - ధామ కువలయదళ
శ్యామా నను గన్న దండ్రీ రామా ||

చ:
సుతుడనుచు దశరథుడు - హితుడనుచు సుగ్రీవు
డతి బలుండనుచు గవులు
క్షితినాథుడనుచు భూ- పతులు కొలిచిరిగాని
పతితపావనుడనుచు - మతిదెలియ లేరయిరి ||

చ: చెలికాడనుచు బాండ-వులు విరోధివటంచు
నల జరాసంధాదులు
కలవాడవని కుచేలుడు నెఱింగిరి గాని
జలజాక్షుడని నిన్ను - సేవింపలే రయిరి ||

చ:
నరుడవని నరులు తమ - దొరవనుచు యాదవులు
వరుడనుచు గోపసతులు
కరివరద భద్రాది- పురనిలయ రామదాస
పరమాత్ముడని నిన్ను - భావింపలేరైరి||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.