Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5833
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, April 16, 2008 @9:11:50 AM EST  

రాగం : పూర్వీకల్యాణి

ప|| నల్లని మేని నగవు చూపుల వాడు
తెల్లని కన్నుల దేవుడు ||

చ|| బిరుసైన దనుజుల పింఛమణచినట్టి
తిరుపు కైదువ తోడి దేవుడు
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి
తెరవు చూపినట్టి దేవుడు ||

చ|| నీటగలసినట్టి నిండిన చదువులు
తేట పరచినట్టి దేవుడు
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు
తీట రాసినట్టి దేవుడు ||

చ|| గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న
తిరువేంకటాద్రిపై దేవుడు
తిరముగ ధౄవునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుడు ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.