Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5920
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, April 18, 2008 @5:08:28 AM EST  

మలయ్ కోఫ్త:

కావలసిన వస్తువులు:
బంగాళాదుంపలు: 2 పెద్దవి
కారెట్, బీన్స్: 1 కప్పు
టొమాటోలు: 6
కార్న్ ఫ్లోర్, శెనగ పిండి, ధనియాల పొడి, కారం, సోడా ఉప్పు: ఒక్కో స్పూన్
ఉల్లిపాయలు: 4 మీడియం సైజ్
పచ్చి బఠానీలు: 100 గ్రా
క్రీం: 5 -10 స్పూన్లు ( మీ ఇష్టం )
అల్లం వెల్లుల్లి పేస్టు : 2 -3 చెంచాలు
లవంగాలు, దాల్చిన చెక్కపొడి : 1 స్పూన్

నూనె : 1/2 కప్పు ( వేయించుకోడానికే )
జీడిపప్పు, 50 గ్రా
గసగసాలు: ఒక చెంచా ( వేస్తే వేయచ్చు నేను వేయను )

చేసే విధానం:
ముందుగా జీడిపప్పు, గసగసాలు రుబ్బి విడిగా ఉంచుకోవాలి. బంగాళా దుంప, కారెట్ ఉడికించి, మెత్తగా చేసి, దానికి ఉడికించిన బీన్స్, మటర్ (పచ్చి బఠానీలు) కలిపి, దానికి శెనగపిండి, కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, గరం మసాలా, కారం, సోడా ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. తరువాత వీటిని గుండ్రంగా తయారు చేసుకుని, ఎర్రగా వేయించి, పక్కన ఉంచుకోవాలి.

ఇంకో గిన్నిలో నాలుగు గరిటెలు నూనె వేసి, కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి, అవి వేగాక టొమాటో గుజ్జు వేసి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి. దానిలో జీడిపప్పు, గసగసాల మిశ్రమం, క్రీం వేసి, చిక్కబడే వరకూ వేయించాలి. ఇప్పుడు కోఫ్తాలపై, ఈ గ్రేవీని వేసి, రుచికి తగినట్టూ, కొత్తిమీర, క్రీం వేసి, తినడమే .



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.