Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6292
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 24, 2008 @7:50:19 AM EST  

రాగం : శంకరాభరణం

ప|| తెలిసినవారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల ||

చ:
పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు ||

చ: పలుబ్రహ్మలకును పరబ్రహ్మము
మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు
ఖలులకెట్లుండునో కానము యితడు ||

చ : వేదంబులలో వేదాంతవేద్యుడు
సోదించకరిగాచుచో నాదిమూలము
ఈదెస శ్రీవేంకటేశుడిందరికి
గాదిలిమతులను గైకొనడితడు ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.