Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6513
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, April 29, 2008 @7:23:35 AM EST  

రాగం: రేవగుప్తి
ప:
పురుషోత్తముడవీవు పురుషాధముడనేను
ధరలోన నాయందు మంచితనమేది |

చరణం:
అనంతాపరాధములు అటునేము సేసేవి
అనంతమైనదయ అదినీది
నినునెరగకుండేటి నీచగుణము నాది
ననునెడయకుండేటి గుణమునీది |

చరణం:
సకలయాచకమే సరుసనాకుపని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించినిన్ను దూరేపలుకే నాకెప్పుడూను
వెకలివైనను గాచేవిధము నీది |

చరణం:
నేరమింతయు నాది నేరుపింతయు నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
ఈరీతి వేంకటేశ యిట్టేనను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.