Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6854
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, May 27, 2008 @1:28:34 AM EST  

రవ్వ ఇడ్లి:

రవ్వ( ఉప్మ రవ్వ) : 2 కప్పులు
పెరుగు (కొద్దిగా పులుపుది) : 1-1/2 కప్పు
పచిమిర్చి: 2
కొత్తిమీర : సన్నగా తురుముకొన్న 1/4 కప్పు
కారట్టు తురుము: 1/4 కప్పు
ఉప్పు : తగినంత
ఆవాలు , కొద్దిగా ఇంగువ , కరివేపాకు : పోపుకి .

తయ్యారు చేసేవిధానము:

రవ్వ కొద్దిగా వేయించుకొని( రంగుమారకుండా) , పూర్తిగా చల్లారేవరకు ఉంచి , పెరుగుని చిలకరించి అందులో కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు , సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చీలు , కొత్తిమీర , తురిమిన కారెట్టు వేసుకోవాలి .
అందులోనే కొద్దిగా పోపు వేసుకోవాలి.
ఈ మిస్రమాన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి .
అరగంట తరువాత ఇడ్లి పాత్రలకి నూనె రాసుకొని ఈ మిస్రమాన్ని వేసుకొని 5-10 నిం. ఉంచి , పూర్తిగా ఉడికింది అనిపించి , దింపుకొని కొబ్బరి చట్నితోటేనా , పుట్నాల పప్పు చట్నీతోటైనా తినడమే .




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.