Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6992
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, July 01, 2008 @1:24:43 AM EST  

రాగం : తోడి
ప :
విరహపు రాజదె విడిదికి రాగా
సిరుల జేసెనిదె సింగారములు ||
చ :
నెలత నుదుటిపై నీలపు కురులనె
తొలుతనె గట్టెను తోరణము
మొలక చెమటలనె ముత్యపు (మ్రుగ్గులు)
అలరిచె మదనుండిదె చెలిమేన ||

చ : దట్టముగ చింతా లతనే వడి
బెట్టె చప్పరము పెనుగొనగా
పట్టిన మై తావులు పరిమళములు
కట్టించెను చెంగట వలరాజు ||

చ :
విందగు వేంకట విభుని ప్రేమచే
పొందగ బెట్టెను బోనాలు
ఇందు వదనికి ఇందిరా విభుని
కందుదేర నలుకలు చవిజేసె ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.