Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 7693
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, July 22, 2008 @11:23:27 PM EST  

ఈ రోజు కొత్తగా ఒక ఐటం చేసాను పేరు ఇంకా పెట్టలేదు. ( బంగాళా భౌ భౌ పెట్టుకోండి) .
పోనీ ఆలూ సెనగపిండి బోండా :

కావలసినవి :

ఆలు : రెండు
బఠానీలు (పచ్చివి) : అర కప్పు ( సగం గుప్పెడు )
ఉల్లిపాయలు : 1 (మీడియం)
కొత్తిమీరి , పుదీన : 1-2 స్పూన్ల తురుము.
సెనగపిండి : 4 స్పూన్లు .
ఉప్పు : రుచికి
పచ్చిమిర్చి : 2 ( సన్నగా తరుకోండి)
నూనె: వేయించడనికి కావల్సినంత.

చేసే విధానం :

ముందుగా ఆలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో ఈ ఉడికించిన ఆలు ముద్ద చేసుకొని , అందులో సెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు , బఠానీలు , పచ్చిమిర్చి , పుదీన, కొత్తిమీర, సెనగపిండి అన్నీ వెసుకొని గట్టిగా కలుపుకోవాలి.

ఆ పిండిని చిన్న చిన్నగా ఉండలు చేసుకొని సన్నటి నూనె సెగలో వేయించుకోవాలి. టమాటా సాస్ తో తింటే బావున్నాయి. ( ఇంతవరకు నాకు ఏమి కాలేదు ) .



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.