Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Maga Maharaju
Name: Sahasra Deepa

Post Number: 1040
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, May 06, 2008 @5:01:43 AM EST  

రాగం: నాదనామ క్రియ
తాళం: ఆది(సౌరాష్ట్ర-అది)

పల్లవి

తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త....
ప్రక్కతోడుగా భగవంతుడు తన
చక్రధరియై చెంతనె యుండగ త...

చరణము(లు)

మ్రుచ్చుసోమకుని మునుజంపినయా
మత్స్యమూర్తి మనపక్షమునుండగ త...

సురులకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ త...

మరాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ త...

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ త...

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ త...

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముని దయ మనకుండగ త...

దశగ్రీవు మును దండించిన యా
దశరధరామును దయ మనకుండగ త...

ఇలలో యదుకులమున నుదయించిన
బలరాముడు మన బలమైయుండగ త...

దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతోనుండగ త...

కలియుగాంత్యమున కలిగిన దైవము
కలికిమూర్తి మము గాచుచు నుండగ త...

నారాయణదాసుని గాచిన శ్రీమన్
నారాయణు నెరనమ్మియుండగ త...

రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ త...