Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Maga Maharaju
Name: Sahasra Deepa

Post Number: 1048
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, May 14, 2008 @4:27:27 AM EST  

రాగం: శంకరాభరణ
తాళం: ఆది

పల్లవి

రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా
తామరసలోచన సీతాసమేత రారా రా...

అనుపల్లవి

ముద్దుముద్దు గారగ నవమోహనాంగ రారా
నిద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా రా.....

చరణము(లు)

చుంచు రవిరేఖతో నీ సొంపు జూతు రారా
పంచదార చిలక నాతొ పలుకుదువు రారా
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా
గట్టిగ కౌసల్య ముద్దుపట్టి వేగ రారా రా...

నిన్ను మానలేనురా నీలవర్ణ రారా
కన్నుల పండువుగా కందు కన్నతండ్రి రర
అందెలు మువ్వలచేత సందడింప రారా
కుందనపు బొమ్మ యెంతొ అందగాడ రారా రా...

నాయెడల దయయుంచి నల్లనయ్య రారా
బాయక యెప్పుడు నీ బంటునయ్య రారా
పాదుకొన్న ప్రేమ నిబ్బరమాయె రారా
పాదసేవకుడను నే ప్రత్యక్షముగ రార రా...

ముజ్జగములకు నాది మూలబ్రహ్మ రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లుఘల్లున రారా
సామగానలోల నాచక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రద్రివాస రారా రా...