Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sahasra
Maga Maharaju
Name: Sahasra Deepa

Post Number: 1148
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, May 19, 2008 @10:22:55 AM EST  

పాటోళీ:

కావలసిన వస్తువులు

శనగపప్పు-2 కప్పులు
అల్లం-చిన్న ముక్క
పచ్చి మిర్చి-4 (కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని మిర్చి వేసుకోవచ్చు)
ఉల్లిపాయ-1
ఎండు మిరపకాయలు-2
శనగపప్పు-1 స్పూన్
మినపప్పు-1 స్పూన్
జీలకర్ర-1 స్పూన్
కరివేపాకు-2 రెబ్బలు
ఆయిల్-అర కప్పు

తయారుచేసే విధానం:

1.ముందుగా శనగపప్పుని ఒక గంట నానపెట్టాలి.
2.నానిన శనగ పప్పుతో పాటు ఒక చిన్న అల్లం ముక్క,పచ్చి మిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.ఆ తరువాత ఒక బాణలీలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పైన చెప్పిన పోపు సామాను (మిర్చి,సనగపప్పు,మినపప్పు,జీలకర్ర) వేసి వేయించుకోవాలి.
4.పోపు వేగాక అందులో ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవాలి.
5.ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ ని వేసి సన్నటి సెగ మీద వుడికించుకోవాలి.మద్య మద్యలో కలుపుతూ బాణలీ అడుగున అంటుకోకుండా కొంచెం పొడిగా అయ్యేవరకు చూసుకోవాలి.
6.అంతె,వేడి వేడి పాటోళీ రెడి,దీనికి మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్.
దీనికి చిన్నగా తరిగి వుడికించిన బీన్స్ కలిపితే అదే బీన్స్ పాటోళీ.అది కూడా బావుంటుంది.

(పాటోళీ కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది.)