Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 371
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, March 29, 2008 @5:19:55 PM EST  

రాగం:కాపి
తాళం:ఆది

పల్లవి

పావన రామనామ సుధారస పానము జేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో....పా..

చరణము.1
దాసులగని సంతోషమ్మున తన దాసోహమ్మన టెన్నటికో
భూసుతకును నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో...పా...

చరణము.2

చంచలగుణములు మాని సదా నిశ్చలయతి నుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నా కెన్నటికో..పా...

చరణము.3

ఇనవంశాంబుది చంద్రుడు కృప నిష్టార్ధము లొసగేదెన్నటికో
కనకచేలు కరుణాలవాలుని కన్నుల జూచేదెన్నటికో...పా...

చరణము.4

వంచన లేకను భద్రాద్రీశుని వర్ణన చేసేదెన్నటికో
అంచితముగ రామదాసుడు ననుకొని ఆనందించేదెన్నటికో..పా...