Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 398
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, March 31, 2008 @12:08:38 PM EST  

రాగం: నాదనామక్రియ
తాళం: ఏక తాళం

కోదండరామ కోదండరామ
కోదండ మాం పాహి కోదండరామ||
నీదండ నాకు నీ వెందు బోకు
వాదేల నీకు వలదు పరాకు|| ||కోదం||

జయ రఘువీర జగదేకశూర
భయనివార భక్తమందార|| ||కోదం||

మణిమయభూష మంజలభాష
రణవిజయఘోష రమణీయవేష|| ||కోదం||

తల్లివి నీవె తండ్రివి నివె
దాతయు నివె దైవము నివె|| ||కోదం||

సరసిజనేత్ర సౌందర్యగాత్ర
పరమపవిత్ర భవ్యచరిత్ర|| ||కోదం||

దశరధబాల దాసానుకూల
దశముఖకాల ధరణీశపాల|| ||కోదం||

మంజులభాష మణిమయభూష
కుంజరపోష కువలయవేష|| ||కోదం||

మురళీవిలోల మునిజనపాల
తులసీవనమాల తుంబురులోల|| ||కోదం||

రావణభంగ రమణీయపాంగ
పావనలింగ పాదాబ్జభృంగ|| ||కోదం||

లాలితహాస లక్ష్మీవిలాస
పాలితదాస భద్రాద్రివాస|| ||కోదం||

శ్రీవిజయరామ శ్రీతులసీదామ
పావననామ భద్రాద్రిధామ|| ||కోదం||