Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 428
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, April 02, 2008 @8:54:32 AM EST  

రాగం:నాదనామ క్రియ
తాళం:ఆదితాళం

ఏమిరా రామ - నావల్ల నేరమేమిరా రామా
ఏమిరామ యీలాగుకష్టము - నీ మహిమో నాప్రారబ్ధమో||

మందరధర నీ - సుందరపదముల
నింది రేశ కను - గొందు జావవే ||ఏ||

దీన మొకయేడుగ - ఘనముగ గడిపెడి
తనయుని మీదను - దయలే దయయో ||ఏ||

రామదాసు భ-ద్రాచల సీతా
రామదాసుడను - బ్రేమతో నేలవే ||ఏ||