Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 477
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 03, 2008 @9:14:53 AM EST  

రాగం:కాంభోజి
తాళం:త్రిపుట

పాహి మాం శ్రీరామ యంటే పలుకవైతివీ - నీ
స్నేహ మెట్టిదని చెప్ప - నొహోహోహో-హోహోహోహో

ఇబ్బంది నొంది యాకరి - బొబ్బ పెట్టినంతలోనె
గొబ్బున గాచితివని - జబ్బు సేయక
నిబ్బరముగా నే నెంతో - కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బు చేసెదవు రామ - అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ||పాహి||

సన్నుతించువారినెల్ల - మున్ను దయతో బ్రోచితివని
పన్నగశాయి నే విని విన్నవించితిని
విన్నపము వినకయెంతో - కన్నడసేసెదవు రామ
యెన్నటికి నమ్మరాదు - అన్నన్నన్నన్నన్నన్నన్న ||పాహి||

చయ్యన భద్రాద్రినిలయ - స్వామివని నమ్మినేను
వెయ్యారు విధముల నుతి - చెయ్యసాగితిని
ఇయ్యెడను రామదాసునీ - కుయ్యాలించి బ్రోవకున్న - నీ
యొయ్యార మేమనవచ్చు - నయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య ||పాహి||