Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 478
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 03, 2008 @9:43:37 AM EST  

రాగం:యమునాకల్యాణి
తాళం:ఆదితాళం

గరుడగమన రారా నను నీ
కరుణ నేలుకోరా
పరమపురుష యే వెరుపులేల నీ
మరుగు జొచ్చితిని అరమరిసేయకు ||గరుడ||

పిలువగానె రమ్మీ యభయము
తలపగానె యిమ్మీ
కలిమి బలిమి నా కిలలో నీవని
పలవరించితిని నలువను గన్నయ ||గరుడ||

పాలకడలిశయనా దశరధ
బాల జలజనయనా
పాల ముంచినను నీటముంచిన నీ
పాలబడితి నిక జాలముసేయక ||గరుడ||

ఏల రావు స్వామీ నను నిపు
డేలుకోవదేమీ
యేలువాడ వని చాల నమ్మితి నిం
కేల రావు కరుణాలవాల హరి ||గరుడ||

ఇంత పంతమేలా భద్రగి||
రీశ వర కృపాల
చింతలణచి శ్రీమదాసుని
అంతరంగపతివై రక్షింపుము ||గరుడ||