Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 513
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, April 08, 2008 @4:37:06 AM EST  

రాగం:సావేరి
తాళం:చావుతాళం

సీతారామస్వామి - నే జేసిననేరము లేమీ?
ఖ్యాతిగ నీ పవ - కంజయుగమునే
ప్రీతిగదలపక భేద మెంచితిన?

రంగుగ నా పదివేళ్ళకు రత్నపు
.......టుంగరములు నిన్నడిగితినా?
సంగతి బంగరు శాలువ పాగా
.......లంగీల్ నడికట్లడిగితినా?
చెంగటిభూసురపుంగవు లెన్నగ
.......చెవులకు చౌకట్లడిగితినా?
ముంగరగొలుసులు ముత్యసుసరములు
.......అంగనులకు నిన్నడిగితినా?|| ||సీతా||

ప్రేమతో నవరత్నంబులు దాపిన
.......హేమకిరీటంబడిగితినా?
కోమలమగు నీ మెడలో పుష్పపు
.......దామము లిమ్మని యడిగితినా?
మోమోటం బిడకుండగ నీదగు
.......మురుగులు గొలుసుల నడిగితినా?
కమలేక్షణ మిము సేవించుటకై
.......ఘనముగ రమ్మని పిలిచితి గాని|| ||సీతా||

తరచుగ నీ పదములు నమరిన సరి
.......గజ్జెల నినునే నడిగితినా?
కరుణారస ముప్పొంగగ గజతుర
.......గము లిమ్మని నే నడిగితినా?
పరమాత్మక నీ బంగరు సేలువ
.......పై గప్పగ నే నడిగితినా?
స్మరసుందర సురవర సంరక్షణ
.......ధన మిమ్మని నిన్నడిగితినా?|| ||సీతా||

ప్రశస్తభద్రాదీశుడ వని నిను
........ప్రభుత్వ మిమ్మని యడిగితినా?
దశరధసుత నీ చేత ధరించిన
........దానకంకణం బడిగితినా?
విశదముగా నీ మేలిమి మొలనూల్
........వేడుకతో నిన్నడిగితినా?
ఏమను భూమిని కుంచెడు నేలకు
........నెక్కువగా ని న్నడిగితినా?|| ||సీతా||