Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 581
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Wednesday, April 09, 2008 @3:58:32 PM EST  

మంగళ హారతి

జయమంగళం నిత్య శుభమంగళం

ధీరునకు వనధిగం-భీరునకు దుష్టసం
హారునకు ఘనమణీ-హారునకునూ
హారడిండీరనీహారహీరపటీర
తారాళి కీర్తి వి-స్తారునకునూ|| ||జయమంగళం||

మంగళము రామునకు - మహితగుణధామునకు
మంగళము క్షీరాబ్ధి - మందిరునకూ
మంగళము మునిబృంద - మానస నివాసునకును
మంగళం సర్వగుణ - మందిరునకూ|| ||జయమంగళం||

ఆద్యునకు బ్రహ్మాది - వేద్యునకు దుర్మనో
భేద్యునకు భవరుజా - వైద్యునకునూ
సద్య ఫలప్రదున - కాద్యంతరహితునకు
విద్యావివేకజన - హృద్యునకునూ|| ||జయమంగళం||

జైత్రునకు సౌమిత్రి - మిత్రునకు భక్తివన
చైత్రులకు నవపద్మ నేత్రునకునూ
మిత్రవంశాబ్ధ - సన్మిత్రునకుసుర వినుత
పాత్రునకు జగదవన - సూత్రునకునూ|| ||జయమంగళం||