Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 768
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, April 21, 2008 @5:12:09 AM EST  

రాగం: శంకరాభరణ
తాళం: చాపు (మేచబౌళి-ఝంప)

పల్లవి

కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం...

చరణము(లు)

కంటి నేడు భక్తగణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం...

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువుతీరిన మా కోదండరాముని కం...

తరణికులతిలకుని ఘననీలగాత్రుని
కరుణా రసము గురియు కందోయి గలవాని కం...

హురు మంచి ముత్యాల సరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం..

ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగ
తళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం...

కరుకు బంగారుచేల కాంతి జగములు గప్ప
శరచాపములు కేల ధరియించు స్వామిని కం..

ధరణిపై శ్రీరామదాసునేలెడు వాని
పరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం...