Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 831
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Wednesday, April 23, 2008 @9:29:37 AM EST  

రాగం: అసావేరి
తాళం: ఆది

పల్లవి

అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా అ...

చరణము(లు)

మేలుచేయుదు నంటిగదరా మేలుచేసితినేమి భయమంటి గదరా
వరహాలు మొహరీలు జమచేస్తిగదరా నీ పరిచారకులకు నే పెట్టితిగదరా అ...

పరులకొక్క రువ్వ యీయలేదుగదరా ఓ పరమాత్మ నీ పాదముల్ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా హరనుత గోవింద హరితాళలేరా అ...

అంతటిలో నిను నెరనమ్మినారా శరణాగత గోవింద హరితాళలేరా
శరధిబంధించిన శౌర్యమెక్కడరా రాక్షససంహార రక్షింపరారా అ...

రామ భద్రాద్రిసీతారామ నీనామమెప్పుడు భజియించితిగదరా
రామదాసుని నిటుల చేయించితేరా అ...