Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 935
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, April 28, 2008 @5:39:26 AM EST  

రాగం: నాదనామక్రియ
తాళం: చాపు

పల్లవి

శ్రీరామనామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం శ్రీ....

చరణము(లు)

గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీ...

విష్ణుకధలు చెవుల విందాం విందాం
వేరేకధలు చెవుల మందాం మందాం శ్రీ...

రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరాం దూరాం శ్రీ...

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులన్నింక మేము నమ్మాం నమ్మాం శ్రీ....

మాధవనామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం శ్రీ...

అవనిజపతిసేవ మానాం మానాం
మరియొక జోలంటే మౌనాం మౌనాం శ్రీ...

భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మనముందాం ముందాం శ్రీ...